పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యూనివర్సల్ హీరో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజాలతో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ వరల్డ్ చిత్రం “కల్కి 2898 ఎడి” కోసం అంతా ఏ రేంజ్ లో ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పుడే పలు ఊహించని లీకులు బయటకి వచ్చేసాయి. అలా ఇప్పుడు మరో ఊహించని లీక్ బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.
అయితే ఈసారి కమల్ హాసన్ లుక్ లీక్ అయ్యినట్టుగా ఓ పిక్ అయితే వైరల్ గా మారింది. ఇందులో కమల్ రీసెంట్ గా ఏ సినిమాలోని కనిపించినట్టు లేరు సో కల్కి లుక్ అనే అనుకోవాలి. మరి ఇలాంటి వాటిని షేర్ చేయకూడదు కాబట్టి మేము పొందుపరచడం లేదు. ఇక ఈ భారీ చిత్రంలో దిశా పటాని, దీపికా పదుకోన్ లు నటిస్తుండగా సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే వైజయంతి మూవీస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.