ప్రభాస్ సినిమా పై మరో ఇంట్రెస్టింగ్ రూమర్ !

ప్రభాస్ సినిమా పై మరో ఇంట్రెస్టింగ్ రూమర్ !

Published on Nov 7, 2022 9:10 PM IST

కమర్షియల్ డైరెక్టర్ మారుతి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ తో ఓ భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా పై ఇప్పటికే ఎన్నో పుకార్లు వైరల్ అయ్యాయి. తాజాగా ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాలో మరో కీలక పాత్రలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కనిపించబోతున్నాడని టాక్ నడుస్తోంది. గతంలో ఈ చిత్రంలో తాత పాత్రలో సత్యరాజ్ నటించబోతున్నాడని వార్తలు వచ్చాయి. అయితే, సత్యరాజ్ చేయాల్సిన ఆ పాత్రలో మోహన్ లాల్ కనిపిస్తాడట. ఇప్పటికి అయితే ఈ వార్త పై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

మొత్తానికి ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందనుంది. అలాగే ఇదొక మాస్ మసాలా ఎంటర్‌టైనర్ అని, ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారని తెలుస్తోంది. మొత్తమ్మీద మారుతి ఈ ప్రాజెక్ట్ కోసం అద్భుతమైన ఎలిమెంట్స్ ను సిద్ధం చేశాడట ప్రభాస్ కి పూర్తిగా ఇది కొత్త జోనర్ అవుతుందట. కాగా ప్రభాస్ తో మారుతి సినిమా చేస్తే.. ఇక మారుతి రేంజ్ మారిపోయినట్టే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు