“శ్యామ్ సింగ రాయ్” నుంచి మరో ఇంట్రెస్టింగ్ సీన్.!

Published on Jan 30, 2022 9:00 am IST

నాచురల్ స్టార్ నాని హీరోగా నాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా అలాగే లేటెస్ట్ సెన్సేషన్ కృతి శెట్టి మరో హీరోయిన్ గా నటించిన చిత్రం “శ్యామ్ సింగ రాయ్”. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తెరకెక్కించిన ఈ చిత్రం అటు థియేట్రికల్ గా మరియు ఇప్పుడు ఓటిటి లో కూడా సాలిడ్ హిట్ అయ్యింది. అయితే ఈ సినిమా ఓటిటి లో వచ్చాక మేకర్స్ ఒక్కో డిలీటెడ్ సీన్ ని రిలీజ్ చేస్తున్నారు. మరి ఇవి కూడా మంచి ఆసక్తికరంగానే ఉన్నాయని చెప్పాలి.

ఇక లేటెస్ట్ గా వచ్చిన నాలుగో సీన్ కూడా బాగుంది. ఈ చిత్రంలో నాని పోషించిన వాసుదేవ్ పాత్ర పై నడిచే సీన్ ఇది. తాను తెలుగులో తీసిన ఉనికి చిత్రం సూపర్ హిట్ అయ్యిన తర్వాత తాను బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ తో మూడు సినిమాలు కాంట్రాక్టు ఎలా కుదుర్చుకున్నాడు? వారు పెట్టుకున్న షరతులు ఏమిటి అనేవి ఈ సీన్ లో బాగా చూపించబడ్డాయి. ప్రస్తుతానికి అయితే ఈ సీన్ కూడా మంచి రెస్పాన్స్ ని అందుకుంటుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :