రాజమౌళి విజన్..చరణ్ పై వైరల్ అవుతున్న మరో స్టన్నింగ్ కాన్సెప్ట్ ఆర్ట్ పోస్టర్.!

Published on Jun 30, 2022 7:11 am IST


లేటెస్ట్ గా పాన్ ఇండియన్ సినిమా నుంచి పాన్ వరల్డ్ స్థాయిలో ఓ రేంజ్ లో సెన్సేషన్ ని రేపుతున్న చిత్రం “రౌద్రం రణం రుధిరం”. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తీసిన ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మల్టీస్టారర్ రాజమౌళి విజన్ కి అద్దం పట్టింది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎంతప్ ఆదరణ అందుకుంటున్నా ఈ చిత్రం నుంచి మేకర్స్ ఒకొక్క కాన్సెప్ట్ ఆర్ట్ పోస్టర్ ని గ్రాఫిక్స్ బ్రేక్ డౌన్ వీడియోస్ ని కూడా రిలీజ్ చేస్తున్నారు.

మరి ఇదిలా ఉండగా గత కొన్ని రోజులు కితం చరణ్ చేసిన రామరాజు పాత్ర చిన్న నాటి సీన్ డిలీటెడ్ ది ఒక సీన్ వైరల్ కాగా ఇప్పుడు ఈ చిత్రంలో ఐకానిక్ షాట్ కి రాజమౌళి ముందు ఎలాంటి కాన్సెప్ట్ ఆర్ట్ ని డిజైన్ చేశారో ఈ సినిమా వి ఎఫ్ ఎక్స్ సూపరవైజర్ రివీల్ చేశారు. లైట్ బాక్గ్రౌండ్ లో చరణ్ రామరాజు కంప్లీట్ లుక్ ని రివీల్ చేసే సన్నివేశం ఇది కాగా ఇప్పుడు దీనికి రాజమౌళి ముందు ఎలాంటి కాన్సెప్ట్ ఆర్ట్ ని డిజైన్ చేయించారో ఆ అదిరే పోస్టర్ మంచి వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం :