“వాల్తేరు వీరయ్య” ట్రీట్ నుంచి మరో అప్డేట్.!

“వాల్తేరు వీరయ్య” ట్రీట్ నుంచి మరో అప్డేట్.!

Published on Nov 26, 2022 1:00 PM IST

మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “వాల్తేరు వీరయ్య”. దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ మాస్ చిత్రం నుంచి మొన్ననే ఫస్ట్ సింగిల్ బాస్ పార్టీ బయటకి వచ్చింది. ఇక ఈ సాంగ్ ఇపుడు మ్యూజిక్ లవర్స్ లో మంచి చార్ట్ బస్టర్ కాగా మాస్ ఆడియెన్స్ ని కూడా ఎంతగానో అలరిస్తుంది.

ఇక ఇదిలా ఉండగా మరో ఇంట్రెస్టింగ్ ట్రీట్ అయితే ఈ సాంగ్ కి సంబంధించి రానున్నట్టుగా ఇప్పుడు సినీ వర్గాలు చెప్తున్నాయి. రేపు ఆదివారం ఈ సాంగ్ తాలూకా మేకింగ్ వీడియోని అయితే మేకర్స్ రిలీజ్ చేయనున్నట్టుగా ఇప్పుడు వినిపిస్తున్న టాక్. మరి దీనితో అయితే మెగా ఫ్యాన్స్ కి మరో సాలిడ్ ట్రీట్ దక్కినట్టే అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు