రవితేజ “ఖిలాడి” నుంచి బిగ్ అప్డేట్ వచ్చేసింది.!

Published on Oct 29, 2021 10:14 am IST

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా చేస్తున్న లేటెస్ట్ అండ్ పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ లో దర్శకుడు రమేష్ వర్మతో ప్లాన్ చేసిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “ఖిలాడి” కూడా ఒకటి. రవితేజ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో సాలిడ్ యాక్షన్ తో ఈ చిత్రాన్ని మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. మరి ఇప్పుడు షూట్ ఫైనల్ టచ్ లో ఉన్న ఈ చిత్రం నుంచి మేకర్స్ ఈరోజు ఓ బిగ్ అప్డేట్ ని రివీల్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

మరి ఇప్పుడు ఈ అప్డేట్ వచ్చేసింది. ఈ చిత్రం నుంచి ఆల్రెడీ ఫస్ట్ సింగిల్ వచ్చి మంచి రెస్పాన్స్ అందుకోగా ఇప్పుడు మేకర్స్ సెకండ్ సింగిల్ ని రిలీజ్ చెయ్యడానికి డేట్ ఫిక్స్ చేశారు. వచ్చే నవంబర్ 4న దీపావళి కానుకగా ఈ ఇంట్రెస్టింగ్ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు.

ఇక ఈ చిత్రంలో మాస్ మహారాజ్ డ్యూయల్ రోల్స్ చేస్తుండగా డింపుల్ హయాతి మీనాక్షి చౌదరిలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని పెన్ స్టూడియోస్ మరియు ఏ స్టూడియోస్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More