“రాధే శ్యామ్” నుంచి ముందే ఇంట్రెస్టింగ్ అప్డేట్.!

Published on Oct 12, 2021 9:00 am IST


పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియన్ సినిమా “రాధే శ్యామ్”. దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమాపై జస్ట్ అప్డేట్ కే సెపరేట్ క్రేజ్ నెలకొంది. ఎందుకంటే అంత తక్కువ మోతాదులోనే ఈ సినిమా నుంచి అప్డేట్స్ వస్తున్నాయి. కానీ మేకర్స్ టైం టు టైం పరిస్థితుల రీత్యా తమ అప్డేట్స్ ని అందిస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ కావడంతో మరిన్ని అప్డేట్స్ రావడానికి సిద్ధంగా ఉండగా..

ఈ అక్టోబర్ నెలలో ముందే ఓ అప్డేట్ రావడానికి రెడీగా ఉంది. మొదట అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు కానుకగా అదిరే గిఫ్ట్ రెడీగా ఉండగా దానికి పదిరోజులు ముందు పూజా హెగ్డే బర్త్ డే ఉండడంతో కాస్త ముందే ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వస్తున్నట్టు తెలుస్తుంది. తన రోల్ ప్రేరణపై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని రివీల్ చేయనున్నారని ఇప్పుడు టాక్. మరి ఆ అప్డేట్ ఏంటో తెలియాలి అంటే రేపటి వరకు ఆగి చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :