“RRR” నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ రానుందా..?

“RRR” నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ రానుందా..?

Published on Aug 10, 2021 7:02 AM IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. దేశ వ్యాప్తంగా సంచలన అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ఉక్రెయిన్ లో షూట్ తో బిజీగా ఉంది. మరి ఈ చిత్రం పై ఎప్పటికప్పుడు సాలిడ్ అప్డేట్స్ ఇస్తూ వస్తున్న ఈ చిత్రం నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ రానున్నట్టుగా టాక్ వినిపిస్తోంది.. అదే ఈ చిత్రం రెండో పాట కోసం..

ఇప్పటికే కీరవాణి స్వరపరిచిన ‘దోస్తీ’ సాంగ్ అన్ని భాషల్లో కూడా చార్ట్ బస్టర్ అయ్యింది. ఇక తొందరలోనే చిత్ర యూనిట్ రెండో సాంగ్ ని కూడా రిలీజ్ చెయ్యాలని సన్నాహాలు చేస్తున్నారట.. మరి ఈ సాలిడ్ అప్డేట్ ఎప్పుడు వస్తుందో అన్నది చూడాలి.. అనేకమంది బిగ్ స్టార్స్ నటిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మాత డి వి వి దానయ్య భారీ వ్యయంతో నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు