“రాధే శ్యామ్” నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ రెడీ!

Published on Feb 12, 2022 10:09 am IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ భారీ పాన్ ఇండియా సినిమా “రాధే శ్యామ్” కోసం అందరికీ తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం విడుదల ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఎట్టకేలకు మళ్ళీ కరోనా మూడో వేవ్ కూడా తగ్గుతుండడంతో ఇక మళ్ళీ ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ని మేకర్స్ ఫైనల్ చేశారు.

ఇక సమయం కూడా తక్కువ ఉండడంతో మళ్ళీ అన్ని పనులు రీస్టార్ట్ చెయ్యాల్సి వచ్చింది. అందులో భాగంగా ఆల్రెడీ దర్శకుడు రాధా కృష్ణ సోషల్ మీడియాలో యమ యాక్టివ్ కాగా చిత్రం నుంచి అప్డేట్స్ కి కూడా మేకర్స్ రంగం సిద్ధం చేస్తున్నారు. మరి అలా లేటెస్ట్ గా ఓ అప్డేట్ ని మేకర్స్ రివీల్ చెయ్యడానికి స్టేజ్ సెట్ చేస్తున్నారు. రానున్న ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే సందర్భంగా ఒక స్పెషల్ అప్డేట్ ని అయితే వదలబోతున్నారట. అసలే ఈ సినిమా ఒక అద్భుతమైన ప్రేమ కథ.. మరి ఆ స్పెషల్ డే కి వచ్చే అప్డేట్ ఏంటో చూడాలి.

సంబంధిత సమాచారం :