“వీరమల్లు” పై మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్.!

“వీరమల్లు” పై మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్.!

Published on Nov 4, 2022 10:00 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రం “హరిహర వీరమల్లు” కోసం అందరికీ తెలిసిందే. మరి భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని అయితే దర్శకుడు క్రిష్ జాగర్లమూడి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మరి పవన్ కెరీర్ లో మొదటి పాన్ ఇండియా సినిమా కూడా ఇదే కావడంతో ఈ చిత్రంపై ఎనలేని హైప్ కూడా ఉంది.

ఇక ఇప్పుడు అయితే ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జోరుగా జరిగిపోతుంది. మరి ఈ షూటింగ్ కి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే తెలుస్తుంది. ప్రస్తుతం అయితే పవన్ పై గడ్డం లుక్ లోనే వారియర్ గెటప్ తో క్రేజీ యాక్షన్ సీక్వెన్స్ ని షూట్ చేస్తున్నారట.

మరి ఇందులో వందలాది మంది ఆర్టిస్టులు పాల్గొంటున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి అయితే పవన్ ఫ్యాన్స్ కి మాత్రం క్రిష్ ఒక గుర్తుండిపోయే సినిమాని అందిస్తున్నారని అనిపిస్తుంది. ఇక ఈ భారీ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా ఏ ఎం రత్నం అయితే భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు