మరో ప్రముఖ ఇంటర్నేషనల్ అవార్డ్ తో “RRR”.!

Published on Jan 31, 2023 9:01 am IST


ఇప్పుడు వరల్డ్ వైడ్ గా కూడా మన టాలీవుడ్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” నెలకొల్పుతున్న రికార్డులు కానీ అందుకుంటున్న రివార్డులు గాని తెలుగు సినిమా సహా భారతీయ సినిమా కి ఎంతో గర్వకారణంగా నిలిచాయి. దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో తీసిన ఈ భారీ హిట్ చిత్రం ఆస్కార్ కి కూడా వెళ్ళింది.

మరి ఈ నామినేషన్ కన్నా ముందే ఎన్నో ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ అవార్డులు గెలుచుకున్న ఈ చిత్రం ఇక లేటెస్ట్ మరో ప్రముఖ అవార్డు గెలుచుకున్నట్టుగా తెలుస్తుంది. వరల్డ్ పాపులర్ రివ్యూ సంస్థ అయినటువంటి రోటెన్ టొమేటోస్ వారు RRR చిత్రానికి గాను 2022 ఫ్యాన్ ఫేవరెట్ చిత్రంగా గుర్తించి అవార్డు అనౌన్స్ చేశారు. దీనితో ఈ భారీ చిత్రానికి మరో ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :