SSMB28: టైటిల్ రివీల్ తో పాటుగా మాస్ వీడియో!

SSMB28: టైటిల్ రివీల్ తో పాటుగా మాస్ వీడియో!

Published on May 26, 2023 8:05 PM IST

కొద్దిసేపటి క్రితం, SSMB28 నిర్మాతలు ఈ సినిమా టైటిల్‌ను మే 31న విడుదల చేయనున్నట్లు పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే ఫ్యాన్స్ ను విశేషం గా ఆకట్టుకుంది. టైటిల్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సూపర్ స్టార్ అభిమానులందరికీ మరో అద్దిరిపోయే అప్డేట్ ను ఇచ్చారు మేకర్స్. టైటిల్‌తో పాటు, ఒక మాస్ వీడియో ను రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఫ్యాన్స్ దానిని రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.

ఇదే విషయాన్ని నాగ వంశీ ధృవీకరించారు. ఫ్యాన్స్ ఆ వీడియో ను రిలీజ్ చేసే వరకూ కూడా ఏ ప్లాట్‌ఫారమ్‌లోనూ బయటకు రాదని కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఈ న్యూస్ ఇప్పుడు ఫ్యాన్స్ కు సూపర్ ట్రీట్ లా మారింది. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, శ్రీలీల కథానాయికలు గా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు