“మా” ఎన్నికల నుంచి తప్పుకున్న మరో కీలక నటుడు.!

Published on Oct 2, 2021 3:00 pm IST


ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో “మా” ఎన్నికల విషయంలో వాతావరణం అంతా హాట్ హాట్ గా నడుస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా అయితే బండ్ల గణేష్ పోటీ నుంచి తప్పుకోవడంతో ఇక యుద్ధం అంతా కేవలం ప్రకాష్ రాజ్ మరియు మంచు విష్ణు ల మధ్యే ఉంటుంది అని క్లారిటీ వచ్చేసింది.

మరి వీరిద్దరూ మీడియా ముఖంగా కథ గట్టిగానే ఒకరిపై ఒకరు గళం విప్పుతుండగా ఈ పోటీ లో తాను తప్పుకుంటున్నట్టుగా సీవీఎల్ నరసింహారావు ప్రకటించారు. మా అధ్యక్ష పదవికి తాను నామినేషన్ వేయగా దానిని పలు కారణాల చేత వెనక్కి తీసుకుంటున్నాని కన్ఫర్మ్ చేశారు.

అంతే కాకుండా పోటీ నుంచి ఎందుకు తప్పుకుంటున్నారో అన్న దానిపై ఈ రానున్న రెండు రోజుల్లో మీడియా ముఖంగా క్లారిటీ ఇవ్వనున్నట్టు తెలిపారు. అయితే ఇప్పుడు ప్యానల్స్ లో ఉన్న ఏ ప్యానల్ కి కూడా తాను మద్దతు ఇవ్వడం లేదు అని చెప్పడం మరింత ఆసక్తిగా పరిస్థితి మారింది.

అలాగే విజయశాంతి గారు తనకి సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపి ఎవరు గెలిచినా కూడా ‘మా’ సంక్షేమం కోసమే పని చెయ్యాలని సూచించారు.

సంబంధిత సమాచారం :