మరో కోలీవుడ్ ఆఫర్ దక్కించుకున్న మీనాక్షి చౌదరి?

మరో కోలీవుడ్ ఆఫర్ దక్కించుకున్న మీనాక్షి చౌదరి?

Published on Jun 22, 2024 3:00 AM IST

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌తో కలిసి మీనాక్షి చౌదరి ది గోట్‌లో కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అర్చన కల్పాతి నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి తమిళ సినిమాలో మరో ఆఫర్ దక్కించుకున్నట్లు కనిపిస్తోంది. లేటెస్ట్ బజ్ ప్రకారం, ప్రముఖ నటుడు సంతానం ప్రధాన పాత్రలో నటిస్తున్న దిల్లుకు దుడ్డు 4 లో ఫీమేల్ లీడ్ రోల్ కి ఎంపిక అయినట్లు సమాచారం.

ప్రేమానంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టాలెంటెడ్ యాక్టర్ ఆర్య నిర్మిస్తున్నారు. మరోవైపు, మీనాక్షి చౌదరి ప్రస్తుతం లక్కీ బాస్కర్‌తో బిజీగా ఉంది. మలయాళ స్టార్‌ దుల్కర్‌ సల్మాన్‌ ఈ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రంలోని మొదటి పాటకు ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు