టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న మరో తమిళ యంగ్ హీరో

harish-kalyan
టాలెంట్ ఉన్న నటులకి టాలీవుడ్ లో ఎప్పుడూ మంచి అవకాశాలు వస్తూనే ఉంటాయి. తెలుగు ప్రేక్షకులు కూడా ఇతర భాషలకు చెందిన ప్రతిభ గల నటుల్ని బాగానే ఆదరిస్తారు. విశాల్, సూర్య, విక్రమ్, విజయ్ ఆంటోని, కార్తీ వంటి హీరోలంతా అలా వచ్చినవాళ్లే. వీరిలో కొంతమందికి ఇక్కడ భారీ స్థాయి మార్కెట్ కూడా ఉంది. ప్రస్తుతం వారి బాటలోనే మరో తమిళ యంగ్ హీరో హరీష్ కళ్యాణ్ తెలుగులోకి అడుగుపెట్టనున్నాడు.

తమిళంలో ‘సింధు సామవేలి, అరిదు అరుదు’ వంటి హిట్ చిత్రాల్లో నటించిన ఇతను నటుడిగా మంచి గుర్తిపు తెచ్చుకున్న ఈ యువ నటుడు దర్శకుడు పట్టాభి డైరెక్షన్లో మొదలుకానున్న కొత్త చిత్రం ద్వారా హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో డి. సురేష్ బాబు ఇటీవలే ఈ చిత్రాన్ని లాంచ్ చేశారు. దీనికి సంబందించిన రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నెలాఖరు నుండి మొదలవుతుంది. పూజా దోషి ఈ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమవుతోంది. ఈ ప్రాజెక్టుకు సంబందించిన మరిన్ని విశేషాలు త్వరలోనే తెలియనున్నాయి.