“భీమ్లా నాయక్” నుంచి మరో లీక్ వైరల్!

Published on Sep 17, 2021 7:05 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి లు ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న లేటెస్ట్ క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం”భీమ్లా నాయక్”. దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ మంచి అంచనాలు నెలకొల్పుకొని సిద్ధం అవుతుంది. మరి ఇదిలా ఉండగా ఇటీవల టాలీవుడ్ లో ఎన్నో సినిమాలను ఇబ్బంది పెడుతున్న లీక్స్ భూతం దీనిపై కూడా ఉంది. ఇది వరకు పలు సన్నివేశాలు వీడియో లు కాబడిన ఈ చిత్రం నుంచి మరో లీక్ బయటకి వచ్చి వైరల్ అవుతున్నట్టు తెలుస్తుంది.

అది కూడా పవన్ పైనే అట. పవన్ చెప్పిన మాస్ డైలాగ్ కి సంబంధించిన చిన్న క్లిప్ బయటకి వచ్చిందని తెలుస్తుంది. మరి ఈ లీక్స్ పరంగా టాలీవుడ్ లో ఆయా సినిమాల మేకర్స్ ఎంత వరకు యాక్షన్ తీసుకుంటున్నారో ఏమో కానీ ఇవి మాత్రం ఆగడం లేదు. ఇక ఈ చిత్రానికి త్రివిక్రమ్ కూడా వర్క్ చేస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :