“పుష్ప” నుంచి మరో లీక్..ఇది ఇంకా వైరల్!

Published on Sep 14, 2021 8:25 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ అండ్ భారీ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. మొత్తం రెండు భాగాలుగా దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తుండగా ఫస్ట్ పార్ట్ లాస్ట్ స్టేజ్ షూట్ కి వచ్చేసింది. అయితే ఈ భారీ చిత్రం కి మొదటి నుంచి కూడా ఓ సమస్య వెంటాడుతూనే ఉంది.. అదే లీకుల సమస్య షూట్ స్టార్టింగ్ నుంచి కూడా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ వరకు పదుల సంఖ్యలో లీక్స్ బయటకి వచ్చాయి.

మేకర్స్ కూడా దీనిపై స్ట్రిక్ యాక్షన్ తీసుకుంటాం అని చెప్పారు కానీ ఇప్పుడు మరో లీక్ బయటకొచ్చి సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతుంది. ఈసారి బన్నీ డైలాగ్ వీడియో బయటకి వచ్చేసినట్టు తెలుస్తుంది. తన చిత్తూ యాసలో ఓ డైలాగ్ చెబుతున్న వీడియో అట.. మరి ఇది అలా రావడం సోషల్ మీడియాలో ఓ లెక్కలో వైరల్ అవ్వడం కూడా శరవేగంగాజరిగిపోయాయి. ఇంకా వాటిని బన్నీ అభిమానులే షేర్ చేసుకుంటుండడం గమనార్హం. ఇక పుష్ప లీక్స్ కి అడ్డు కట్ట పడేది ఎప్పుడో ఏంటో మరి.

సంబంధిత సమాచారం :