“RRR” హీరోస్ పై మరో మార్వెల్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

Published on Jun 9, 2023 10:12 pm IST

ఒక్క వరల్డ్ వైడ్ గానే కాకుండా మన ఇండియాలో కూడా మార్వెల్ కామిక్స్ గాని మార్వెల్ సినిమాలకి గాని నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాల దర్శకులు సహా హీరోలను కూడా మన టాలీవుడ్ ప్రైడ్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” RRR మెప్పించిన సంగతి తెలిసిందే.

మరి రీసెంట్ గానే స్పైడర్ మ్యాన్ హీరో టామ్ హోలాండ్ సినిమాపై స్పందించగా. ఇక లేటెస్ట్ గా అయితే మరో మార్వెల్ హీరో ది “థోర్” క్రిస్ హేమ్స్ వోర్త్ అయితే కామెంట్స్ చేశారు. రీసెంట్ RRR సినిమా చూశానని తనకి RRR బాగా నచ్చింది అదొక ఇంక్రెడిబుల్ సినిమా అంటూ కొనియాడాడు.

అంతే కాకుండా హీరోలు రామ్ చరణ్, జూ ఎన్టీఆర్ లు సినిమాలో అద్భుతంగా నటించారని అలాగే వారితో నటించే అవకాశం వస్తే ఫెంటాస్టిక్ గా ఉంటుంది అని తెలిపాడు. దీనితో ఈ కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి. ఇక క్రిస్ అయితే తన బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ “ఎక్స్ ట్రాక్షన్ 2” రిలీజ్ తో సిద్ధంగా ఉన్నాడు. ఈ చిత్రం ఈ జూన్ లో నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం :