జిఎస్టీ ఎఫెక్ట్ మరొక సినిమాకి కూడా తగిలింది !
Published on Nov 23, 2017 9:21 am IST

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పన్ను పద్ధతి జిఎస్టీ సినిమాల మీద బాగానే ప్రభావం చూపిస్తోంది. సినిమాల్లో ఈ జిఎస్టీ విధానాన్ని ఏ సందర్భంలో విమర్శించినా సెన్సార్ బోర్డ్ అస్సలు సహించడం లేదు. అందుకు నిదర్శనం ఇటీవలే విడుదలైన విజయ్ ‘మెర్సల్’ సినిమా. ఈ సినిమాలో జిఎస్టీని విమర్శించేలా కొన్ని డైలాగ్స్ ఉన్నాయని బీజేపీ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. చివరికి తమిళంతో పాటు తెలుగు వెర్షన్లో కూడా ఆ డైలాగ్స్ ను మ్యూట్ చేశారు.

ఇప్పుడు నటుడు విజయ్ ఆంటోనీ నటించిన తాజా చిత్రం ‘అన్నాదురై’ తెలుగులో ‘ఇంద్రసేన’ పేరుతో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో జీఎస్టీ పాదంతో మొదలయ్యే పాట ఒకటి ఉంది. ఇటీవలే విడుదలైన ఈ సాంగ్ మంచి ఆదరణను కూడా తెచ్చుకుంది. కానీ సెన్సార్ బోర్డు మాత్రం పాటలో జిఎస్టీ అనే పదం ఉండటానికి వీల్లేదని అబ్జక్షన్ పెట్టిందట. దీంతో ఆ పదాల స్థానంలో వేరే పదాల్ని రీప్లేస్ చేసే పనిలో పడ్డారట యూనిట్. మరి ముందు ముందు ఈ జిఎస్టీ ఎఫెక్ట్ ఇంకెన్ని సినిమాలకు తగులుతుందో మరి.

 
Like us on Facebook