సంక్రాంతి బరిలో సిద్ధం అవుతున్న మరో మల్టీస్టారర్.?

Published on Oct 24, 2021 7:06 pm IST

పండుగ వస్తుంది అంటే దానితో పాటుగా సినిమా పండుగ కూడా మొదలయ్యినట్టే అని చెప్పాలి. వాటిలో సంక్రాంతి పండుగ మన టాలీవుడ్ లో కీలక పాత్ర పోషిస్తుంది. గార రెండు సంక్రాంతిలకు అదిరే సినిమాలు వచ్చినా వచ్చే ఏడాది సంక్రాంతి మాత్రం సూపర్ స్పెషల్ అని చెప్పి తీరాలి. ఓ భారీ పాన్ ఇండియన్ సినిమా “రౌద్రం రణం రుధిరం” ఆల్రెడీ లైన్ లో ఉండగా దానితో పాటుగా “భీమ్లా నాయక్” సినిమా కూడా ఉంది(ఇంకా కన్ఫర్మేషన్ లో).

అయితే ఈ రెండు సినిమాలు కూడా టాలీవుడ్ నుంచి సాలిడ్ మల్టీ స్టారర్ సినిమాలు అని తెలిసిందే. మరి ఇదిలా ఉండగా వీటితో పాటుగా మరో మల్టీ స్టారర్ “ఎఫ్3” కూడా ఉండొచ్చని ముందు బజ్ రాగా అక్కడ నుంచి సినిమా షిఫ్ట్ అయ్యినట్టు మేకర్స్ ఈరోజు కన్ఫర్మ్ చేశారు. కానీ ఈ లిస్ట్ లో మరో ఇంట్రెస్టింగ్ మల్టీ స్టారర్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

అదే అక్కినేని నుంచి వస్తున్న చిత్రం “బంగార్రాజు”. నాగార్జున మరియు నాగ చైతన్య లు నటిస్తున్న ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలో ఉంటుంది అని టాక్. మరి ఇందులో ఎంతమేర నిజముందో కానీ ఒకవేళ నిజం అయితే వచ్చే సంక్రాంతి రేస్ క్రేజీ మల్టీ స్టారర్స్ తో సందడి చేయడం గ్యారంటీ అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :

More