నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్.!

Published on May 5, 2022 1:00 pm IST

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి ఎన్నో నిర్మాణ సంస్థలలో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థలలో “రావణాసుర”, “డెవిల్” లాంటి పలు సాలిడ్ ప్రాజెక్ట్స్ అభిషేక్ పిక్చర్స్ కూడా ఒకటి. అయితే ఎప్పటికప్పుడు మంచి సబ్జెక్ట్స్ తో అలరిస్తూ వస్తున్న వీరి నుంచి గత కొన్ని రోజులు కితమే ఒక యూత్ ఫుల్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చెయ్యగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ని వారు అనౌన్స్ చేశారు.

యంగ్ హీరోయిన్ కలర్స్ స్వాతి తో దర్శకుడు ఆదిత్య హాసన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా బ్యూటిఫుల్ ఎమోషన్స్ తో తెరకెక్కుతుంది అని తెలుపుతున్నారు. అలాగే ఈ చిత్రానికి ఇడియట్స్ – ది రియల్ హీరోస్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసి ఇంట్రెస్టింగ్ పోస్టర్ ని రిలీజ్ చేసి తమ బ్యానర్ నుంచి ప్రొడక్షన్ 8 నెంబర్ గా అనౌన్స్ చేశారు. ఇక ఈ చిత్రంలో శ్రీ హర్ష నిఖిల్ దేవుడాల,సిద్ధార్థ్ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :