#NBK107: ఊర మాస్ లుక్‌లో బాలకృష్ణ..!

#NBK107: ఊర మాస్ లుక్‌లో బాలకృష్ణ..!

Published on Feb 19, 2022 1:34 AM IST

నందమూరి బాలకృష్ణ కెరీర్‌ బెస్ట్ లుక్స్‌లో ఒకటి అఖండలో కనిపించింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ హ్యాట్రిక్ చిత్రంలో బాలయ్య కనిపించిన అఘోరా మరియు క్యాజువల్ లుక్స్ రెండు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇకపోతే బాలకృష్ణ తాజాగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో #NBK107 ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం తాజాగా సిరిసిల్లలో షూటింగ్‌ని మొదలుపెట్టింది. రాం-లక్ష్మణ్ నేతృత్వంలో బాలయ్యపై యాక్షన్ సీన్స్ తెరకెక్కించినట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో బాలకృష్ణ ఊర మాస్ లుక్‌లో,. రఫ్ గడ్డంతో కనిపిస్తున్నాడు. బాలయ్య ప్రధాన లుక్స్‌లో ఇది కూడా ఒకటిగా నిలుస్తుందట. ఇదిలాఉంటే ఈ సినిమాలో బాలయ్య సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు