“పుష్ప 2” నుంచి మరో ట్విస్ట్.. ఇప్పుడొక క్లారిటీ వస్తుంది!

“పుష్ప 2” నుంచి మరో ట్విస్ట్.. ఇప్పుడొక క్లారిటీ వస్తుంది!

Published on Jan 23, 2025 4:00 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియా హిట్ చిత్రం “పుష్ప 2 ది రూల్” కోసం అందరికీ తెలిసిందే. మరి హిందీ మార్కెట్ లో సరికొత్త లెక్కలు చూపించిన ఈ సినిమా సెన్సేషన్ ఇప్పటికీ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా తాలూకా ఒరిజినల్ సౌండ్ ట్రాక్ లు బయటకి రావడం జరిగింది. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సాలిడ్ ట్యూన్స్ ఆల్రెడీ సోషల్ మీడియాలో రూల్ చేస్తున్నాయి.

అయితే ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మాత్రమే కాకుండా కోలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు సామ్ సి ఎస్ కూడా వర్క్ చేసాడు. అయితే సినిమాలో ఎవరెవరు ఏ స్కోర్ అందించారు అనేది ఇపుడు తేటతెల్లం కానుంది అని చెప్పాలి. రీసెంట్ గానే దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్స్ వస్తే సామ్ సి ఎస్ కూడా ఇపుడు తన వెర్షన్ పుష్ప 2 ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ని వదలబోతున్నట్టుగా కన్ఫర్మ్ చేసాడు. దీనితో పుష్ప 2 లో ఎవరెవరు ఏ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు అనేది ఒక కొలిక్కి రానుంది అని చెప్పవచ్చు. ఇక ఈ ఓఎస్టి ఎప్పుడు వస్తుంది అనేది డేట్ ఇంకా కన్ఫర్మ్ కావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు