మరో ఓటిటి సంస్థ బాలయ్యతో భారీ ప్లాన్.?

Published on Mar 23, 2023 12:02 pm IST


ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మరి సరికొత్త ఊహించని అవతార్స్ లో చేస్తున్న సినిమా కోసం తెలిసిందే. దీనిని దర్శకుడు అనీల్ రావిపూడి అయితే తెరకెక్కిస్తుండగా భారీ అంచనాలు ఇక దీనిపై నెలకొన్నాయి. మరి ఈ సాలిడ్ ప్రాజెక్ట్స్ తో సిల్వర్ స్క్రీన్స్ పై అలరిస్తున్న బాలయ్య ఆహా లో సెన్సేషనల్ టాక్ షో తో అదిరే ఓటిటి ఎంట్రీ ఇచ్చారు.

మరి దాని తర్వాత ఆహా లోనే మరో షో లో జడ్జి గా పాల్గొన్న బాలయ్య తో అయితే మరో ప్రముఖ ఓటిటి సంస్థ అయితే ఏకంగా ఓ వెబ్ సిరీస్ ప్లాన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఇది భారీ లెవెల్లో హంగులతో అయితే ప్లాన్ చేస్తున్నారట. దీనితో బాలయ్య నుంచి ఓ వెబ్ సిరీస్ ని కూడా మనం ఆశించవచ్చని చెప్పాలి. అలాగే ఈ సంస్థ ఏంటి? ఎప్పుడు నుంచి ఈ సిరీస్ స్టార్ట్ అవుతుంది అనే ఇతర వివరాలు మున్ముందు అందించనున్నాము.

సంబంధిత సమాచారం :