పాన్ ఇండియా అవైటెడ్ భారీ చిత్రం “సలార్” కోసం అందరికేష్ తెలిసిందే. మరి పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ సినిమానే ఇది. ఇక ఈ భారీ సినిమా రిలీజ్ విషయంలో ఇటీవల కాలంలో ఏ సినిమాకి కూడా ఇన్ని ట్విస్ట్ లు ఎవరూ చూడలేదు. ఏదొక టైమ్ అంటూ చాలానే వైరల్ గా మరగా లేటెస్ట్ గా అయితే డిసెంబర్ రిలీజ్ అంటూ నీల్ భార్య పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.
మరి దీనికి ఇప్పుడు ఆదనపు పాజిటివ్ క్లారిటీ తోడయ్యింది అని చెప్పాలి. ఈ సినిమాకి ఓవర్సీస్ రిలీజ్ ని ఊహించని లెవెల్లో అయితే ప్రత్యంగిరా వారు ఇది వరకే స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. మరి లేటెస్ట్ గా అయితే మళ్లీ స్టార్ట్ చేద్దామా అన్నట్టు గా పోస్ట్ పెట్టడంతో సలార్ డిసెంబర్ రిలీజ్ కి ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది అని క్లారిటీ ఇప్పుడు వచ్చేసింది. దీనితో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Malli Start Cheddaaamaa… ???????????????? pic.twitter.com/Tpqrp0AG3h
— Prathyangira Cinemas (@PrathyangiraUS) September 25, 2023