‘మహేష్ – రాజమౌళి’ సినిమాలో ఆ హీరోయిన్.. నిజం కాదు !

Published on Sep 18, 2022 5:02 pm IST

రాజమౌళి – మహేష్ బాబు సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ? అంటూ మహేష్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ సినిమా గురించి ఒక లేటెస్ట్ అప్ డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ చిత్రంలో హీరోయిన్ ఆలియా భట్ నటించబోతుంది అని, ఇప్పటికే రాజమౌళి ఆమెను హీరోయిన్ గా ఫైనల్ చేశారని టాక్ నడిచింది. అయితే, ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదు అని తెలుస్తోంది.

ఇంకా రాజమౌళి, మహేష్ సినిమాకు సంబంధించి ఫైనల్ స్క్రిప్ట్ ను ఇంకా ఫైనల్ చేయలేదు అని తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి లాస్ట్ వీక్ లో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా లాంచ్ చేయాలని.. అప్పటి లోపు స్క్రిప్ట్ పనులు పూర్తి చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడట. స్క్రిప్ట్ ఫినిష్ అయ్యాకే, నటీనటులు ఫైనల్ చేస్తారట.

ఇక ఈ చిత్రం ఆఫ్రికా బ్యాక్‌ డ్రాప్‌ లో అడ్వెంచర్ థ్రిల్లర్‌ గా ఈ కథా నేపథ్యం సాగుతుందని తెలుస్తోంది. ఆ మధ్య విజయేంద్రప్రసాద్‌ ఈ సినిమా కథ గురించి ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. ‘నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్‌ స్మిత్‌ కు పెద్ద అభిమానులం. అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ ను రాయాలనుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :