మరో విషాదం..సీనియర్ ఆర్టిస్ట్ చలపతి రావు కన్నుమూత.!

మరో విషాదం..సీనియర్ ఆర్టిస్ట్ చలపతి రావు కన్నుమూత.!

Published on Dec 25, 2022 7:39 AM IST

ఈ ఏడాది తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా వరుస విషాదాలు చోటు చేసుకోవడం ఊహించని అంశంగా మారింది. పైగా మన ఇండస్ట్రీ కి చెందిన సీనియర్ నటులే ఈ ఏడాది కన్ను మూయడం అనేది మరో పెద్ద షాకింగ్ అంశం. ఈ కొన్ని నెలల వ్యవధి లోనే రెబల్ స్టార్ కృష్ణం రాజు గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు అలాగే మొన్ననే నటులు కైకాల సత్యన్నారాయణ గారు కన్ను మూశారన్న వార్తలతో టాలీవుడ్ లో తీవ్ర విషాదాలు నెలకొన్నాయి.

మరి ఈ వార్తలు మరవక ముందే మరో సీనియర్ ఆర్టిస్ట్ చలపతి రావు గారు కన్ను మూశారన్న వార్త ఈ ఉదయం వినాల్సి వచ్చింది. మరి తాను ఆర్టిస్ట్ గా 1200కి పైగా సినిమాలు చేయగా నిర్మాతగా కూడా పలు చిత్రాలు చేశారు. మరి నిన్న రాత్రి అయితే తాను ఆకస్మిక గుండెపోటు కారణంగా తన 78వ ఏట కన్ను మూసినట్టుగా తెలిసింది. దీనితో ఈ వార్త విన్న టాలీవుడ్ ప్రముఖులు ఒక్కసారిగా దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మరి వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మా 123తెలుగు యూనిట్ కోరుకుంటుంది. ఓం శాంతి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు