“ఆదిపురుష్” పై మరో షాకింగ్ బజ్.!

“ఆదిపురుష్” పై మరో షాకింగ్ బజ్.!

Published on Nov 26, 2022 10:00 AM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో ఆల్రెడీ షూటింగ్ పూర్తి అయ్యిన చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన ఈ భారీ ఇతిహాస కావ్యం ఇప్పుడు మరింత స్థాయిలో హంగులను జోడించుకొని కాస్త లేట్ గా రిలీజ్ కాబోతుంది.

అయితే ఇప్పటికే జనవరి నుంచి జూన్ కి వాయిదా పడిన ఈ చిత్రం మరోసారి వాయిదా పడనున్నట్టుగా పలు రూమర్స్ అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. దీనితో ఈ భారీ చిత్రం వచ్చే ఏడాది నుంచి ఏకంగా ఆ వచ్చే ఏడాదిలోనే వస్తుందని కొన్ని పుకార్లు అయితే ఇప్పుడు మొదలయ్యాయి.

అయితే ఇందులో ఇంకా ఎంతవరకు నిజముందో కాలమే నిర్ణయించాలి. అలాగే దీనికి కారణం అయితే సినిమా అవుట్ పుట్ కోసమే అన్నట్టు తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో బెటర్ విజువల్స్ రావాలనే లేట్ అయినా పర్వాలేదని మేకర్స్ అనుకుంటున్నారట. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు