“హరిహర వీరమల్లు” నుంచి మరో అదిరే ట్రీట్ అట.!

Published on Sep 25, 2022 1:20 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో తన మొదటి భారీ పాన్ ఇండియా సినిమా “హరిహర వీరమల్లు” కూడా ఒకటి. విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం భారీ పీరియాడిక్ వండర్ గా వస్తుండగా అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇక రీసెంట్ గా పవన్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేసినటువంటి పవర్ గ్లాన్స్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాకి పాన్ ఇండియా లెవెల్లో మంచి బజ్ కూడా స్టార్ట్ అయ్యింది.

ఇక ఇప్పుడు ఈ సాలిడ్ ట్రీట్ తర్వాత మరో క్రేజీ ట్రీట్ సిద్ధం అవుతున్నటుగా సినీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఇది ఈ ఏడాది చివర డిసెంబర్ 31న మేకర్స్ అందిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక అప్డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే మెగా సూర్య ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :