పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “ఓజి” కోసం అందరికీ తెలిసిందే. మరి పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హైప్ తో వస్తున్న ఈ చిత్రం నుంచి వచ్చిన గ్లింప్స్ తో అయితే అంతా ఒక్కసారిగా మారిపోయింది. అయితే ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు పవన్ లేని పార్ట్ వరకు కూడా షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారు.
ఇక ఈ చిత్రం నుంచి ఈ ట్రీట్ తర్వాత అయితే మేకర్స్ ఇంకో సాలిడ్ అప్డేట్ కి రెడీ అవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. లేటెస్ట్ గా ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఆస్కార్ రవిచంద్రన్ అయితే సంగీత దర్శకుడు థమన్ తో కలిసి ఓ పిక్ అయితే పోస్ట్ చేశారు.
దీనితో అయితే తమ హంగ్రీ చీతా నుంచి ఓ సంథింగ్ ఎగ్జైటింగ్ అప్డేట్ వస్తుంది అని కన్ఫర్మ్ చేశారు. మరి ఈసారి ఓజి నుంచి ఏం ప్లాన్ చేస్తున్నారో అని ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా దీని కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఈ భారీ సినిమాలో అర్జున్ దాస్, శ్రీయ రెడ్డి అలాగే బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ లు నటిస్తుండగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ చిత్రం తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.
Something exciting coming from @MusicThaman #HungryCheetah pic.twitter.com/jnmySmEki8
— ravi k. chandran (@dop007) September 27, 2023