“వలిమై” నుంచి మరో సాలిడ్ ట్రీట్ వస్తుందట.!

Published on Sep 16, 2021 7:11 pm IST

కోలీవుడ్ స్టార్ థలా అజిత్ కుమార్ హీరోగా నటించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “వలిమై”. దర్శకుడు హెచ్ వినోత్ తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఇది. మరి భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం నుంచి మేకర్స్ ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ సింగిల్, మోషన్ పోస్టర్ అన్నిటికీ కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది మరి వీటన్నిటిని మించి రానున్న సాలిడ్ అప్డేట్ ఇంకా గట్టి రీసౌండ్ ఇస్తుందని అని బజ్ వినిపిస్తుంది.

అదే ఈ సినిమా మేకింగ్ వీడియోతో అట.. ఈ సినిమా నుంచి ఓ సాలిడ్ మేకింగ్ వీడియో కట్ ని రెడీ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో నయా టాక్. అంతే కాకుండా ఇది మంచి ట్రీట్ కూడా ఇవ్వడం ఖాయం అని తెలుస్తుంది. చాలా గట్టి అవుట్ పుట్ తోనే ఇది రానుందట. అసలే ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లని పెద్ద మొత్తంలోనే ప్లాన్ చేశారు. మరి ఈ మేకింగ్ వీడియోలో అజిత్ ఎలాంటి సాహసాలు చేసారో చూడాలి.

సంబంధిత సమాచారం :