గెట్ రెడీ..’భీమ్లా’ నుంచి మరో అదిరే అప్డేట్ వస్తుంది.!

Published on Sep 17, 2021 12:52 pm IST


ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి వస్తున్న కొన్ని క్రేజీ రీమేక్ చిత్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి మరో ప్రధాన పాత్రలో నటిస్తున్న “భీమ్లా నాయక్” కూడా ఒకటి. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం ఒక్కో అప్డేట్ తో మంచి అంచనాలు పెంచుకుంటూ వెళ్తుంది. అయితే ఈ సినిమా నుంచి ఈరోజు సాలిడ్ అప్డేట్ రానా పై ఓ అప్డేట్ ఉంటుందని బజ్ ఉంది.

కానీ దానిపై హింట్ ఇస్తూ ఈరోజు మాత్రం సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు ఒక అప్డేట్ ని ఇస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. రానా చేస్తున్న డానియల్ శేఖర్ రోల్ పై అప్డేట్స్ కోసం కూడా అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఆ అప్డేట్ రానా పైనేనా కాదా అన్నది ఎదురు చూసి చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :