‘ఇరుముడి’కి మరో సాలిడ్ వీకెండ్!

irumudi

మాస్ మహారాజ రవితేజ హీరోగా హీరోయిన్ ప్రియా భవాని శంకర్ అలాగే బేబీ నక్షత్ర కలయికలో దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఎమోషనల్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రామే ఇరుముడి. సాలిడ్ ఎమోషన్స్ కి అయ్యప్ప స్వామి ఫాక్టర్ యాడ్ అయ్యి ఈ సినిమాని తెలుగు ఇండస్ట్రీ దగ్గర బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిపింది.

ఇక రిలీజ్ వారం నుంచే సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపుతూ వచ్చింది. మెయిన్ గా వీకెండ్స్ లో పలు భారీ సినిమాలు ఉన్నప్పటికీ తెలుగు స్టేట్స్, ఇండియా వైడ్ బుకింగ్స్ లో ఈ సినిమా డామినేట్ చేసింది. ఇక అలా మరో వారంతాన్ని కూడా ఇరుముడి కైవసం చేసుకోవడం గ్యారెంటీ అని చెప్పవచ్చు.

ఈ వారం సినిమాలు ఎక్కువే ఉన్నాయి కానీ గట్టి బజ్ తో ఏది ఆడియెన్స్ అటెన్షన్ లోకి వెళ్ళలేదు. సో ఇరుముడి ఈ వారాంతంలో కూడా అదరగొట్టే ఛాన్స్ ఉంది. ఇక ఈ సినిమాకి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.

Exit mobile version