ధనుష్ “నేనే వస్తున్నా” నుంచి మరో సాంగ్ బయటకి..!

Published on Sep 25, 2022 12:31 pm IST

గ్లోబల్ స్టార్‌ హీరో ధనుష్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ ‘నానే వరువెన్’. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ మూవీకి సెల్వ రాఘవన్‌ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ‘నానే వరువెన్’ నుంచి రిలీజైన పోస్టర్లు, పాటలు సినిమాపై మంచి అంచనాలను నెలకొల్పాయి. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ బ్యానర్ గీతా ఆర్ట్స్ సమర్పణలో “నేనే వస్తున్నా” పేరుతో ఈ చిత్రం తెలుగులో రిలీజ్ కాబోతుంది. ఇక లేటెస్ట్ గా అయితే ఈ చిత్రం నుండి “ఒకే ఒక ఊరిలోనా రాజులేమో ఇద్దరంటా” అనే రెండో సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.

ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ రాసిన ఈ పాటలో “పాముల్లోనా విషముంది,పువ్వులోని విషముంది. పూలను తల్లో పెడతారే పామును చూస్తే కొడతారే. మనిషిలో మృగమే దాగుంది, మృగములో మానవత ఉంటుంది” అనే ఇంట్రెస్టింగ్ లిరిక్స్ ని ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ చేస్తున్న ధనుష్ లోని రెండు విభిన్నకోణాలని ఆవిష్కరించడమే కాకుండా, ఆలోచించే విధంగా ఉన్నాయి. చంద్రబోస్ రాసిన ఈ పాటను ఎస్.పి.అభిషేక్, దీపక్ బ్లూ ఆలపించారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :