షారుఖ్ సినిమాలో మరో సౌత్ స్టార్ ?

Published on Sep 13, 2021 10:42 am IST

తమిళ యంగ్ డైరెక్టర్ అట్లీకి నేషనల్ వైడ్ గా మంచి ఫాలోయింగ్ ఉంది. అట్లీ అంటే బాలీవుడ్ ప్రేక్షకులు కూడా అభిమానం చూపిస్తున్నారు. అందుకే బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కూడా అట్లీతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే, అట్లీ – షారుఖ్ సినిమాలో మరో స్టార్ హీరో కీలక పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. విజయ్ సేతుపతి ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నాడు.

ఇక సమ్మర్ లోనే ఈ సినిమాని స్టార్ట్ చేయాలని చూశారు, కానీ కరోనా రాకతో ఈ సినిమా పోస్ట్ ఫోన్ అయిందట. అట్లీ – షారుఖ్ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. షారుఖ్ ప్రస్తుతం ‘పఠాన్’ అనే మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మరో రెండు నెలల్లో పూర్తి కానుంది.

సంబంధిత సమాచారం :