‘ధరమ్ తేజ్’ కోసం మరో స్పెషల్ గెస్ట్ !


మెగాహీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘విన్నర్’. గత సినిమా ‘తిక్క’ అంతగా రిజల్ట్ ఇవ్వకపోవడంతో ప్రస్తుతం తేజ్ ఆశలన్నీ ఈ చిత్రంపైనే ఉన్నాయి. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఈ నెల 24న రిలీజ్ కావడానికి రెడీ అవుతోంది. అందుకే చిత్ర టీమ్ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడానికి సరికొత్త పద్దతులను ఎంచుకుంటోంది. ఆడియో పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ నిత్యం ప్రేక్షకుల నుండి అటెంక్షన్ తీసుకుంటుంతోంది. ఆ విడుదల కూడా పెద్ద సెలబ్రిటీల చేతుల మీదుగా కావడం విశేషం.

మొన్న మొదటి పాట ‘సితారను..’ సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల చేసి హడావుడి చేసిన టీమ్ రెండవ పాటను కూడా అలాగే ఓ స్పెషల్ గెస్ట్ చేతుల మీదుగా లాంచ్ చేయాలని ప్లాన్ చేసింది. అయితే ఆ సెప్షల్ గెస్ట్ ఎవరనేది మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. ఈ పాట రేపు ఉదయం 11 గంటలకు విడుదలకానుంది. మెగా అభిమానులంతా ఈసారి కూడా ఎవరో ఒక పెద్ద స్టార్ ఈ విడుదల చేస్తారని అనుకుంటున్నారు. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో తేజ్ కు జంటగా రకుల్ ప్రీత్ నటించింది.