మెగాస్టార్ సినిమాలో మరో హీరో?

Published on Apr 23, 2022 3:02 am IST

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన ప్రధాన పాత్రలో, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా మరో కీలక పాత్రలో బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ చేసిన మెగా మాస్ మల్టీస్టారర్ చిత్రం “ఆచార్య” విడుదలకు సిద్ధమౌతుంది. గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలు సెట్స్ పై ఉండగా, బాబీతో సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్స్క్స్‌లో ఉండగా, వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబోతున్న సినిమా స్క్రిప్ట్ కూడా లాక్ అయ్యింది.

అయితే ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే.. ఇది ఒక మెసేజ్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ అని, సొసైటీలోని ఓ ఇష్యూని చాలా కమర్షియల్ గా చూపించబోతున్నారని తెలిసింది. ఇది మల్టీస్టారర్. ఇందులో చిరుతో పాటు మరో స్టార్ హీరో కూడా వుండే అవకాశం వుంది. ప్రస్తుతం కొందరి హీరోల పేర్లు పరిశీలిస్తున్నారు.

ఇప్పటికే గాడ్ ఫాదర్ లో సల్మాన్ ఖాన్ మెగస్టార్‌తో స్క్రీన్ పంచుకుంటున్నారు చిరు. వెంకీ సినిమాకి కూడా అంతే స్థాయిలో స్టార్ డమ్ వున్న హీరోని తీసుకురావడానికి చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :