బాలయ్యతో “వీరసింహా రెడ్డి” కన్నా ముందు మరో స్టోరీ.?

Published on Jan 20, 2023 12:01 am IST

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కి వచ్చి సెన్సేషనల్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ మరియు శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “వీరసింహా రెడ్డి” కూడా ఒకటి. మరి ఈ చిత్రాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించగా మళ్ళీ బాలయ్య కెరీర్ లో అయితే ఓ సాలిడ్ హిట్ పడింది. ఇక ఈ చిత్రం సక్సెస్ లో భాగంగా మేకర్స్ అయితే ఆల్రెడీ సంబరాలు పలు ఇంటర్వ్యూ లు కూడా స్టార్ట్ చేశారు.

అలా దర్శకుడు గోపీచంద్ మలినేని అయితే ఇంట్రెస్టింగ్ అంశం రివీల్ చేశారు. ఈ చిత్రం కన్నా ముందు అయితే బాలయ్య కి తాను మరో కథ నరేట్ చేయడం జరిగింది అట. కానీ బాలయ్య సూచన మేరకు తాను వీరసింహా రెడ్డి డెవలప్ చేసానని తెలిపారు. దీనితో అలా వీరి కాంబో నుంచి మరో సినిమా రావాల్సి ఉండగా వీరసింహా రెడ్డి లతో పవర్ ఫుల్ సబ్జెక్టు బాలయ్య మూలాన వచ్చింది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :