కమల్ “విక్రమ్” లో మరో విలక్షణ స్టార్ నటుడు కూడా అట.!

Published on May 13, 2022 10:59 am IST

విశ్వ నటుడు కమల్ హాసన్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ సినిమా “విక్రమ్” కోసం అందరికీ తెలిసిందే. కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ పై ఇంత హైప్ నెలకొనడానికి తన డైరెక్షన్ ఒకటి పక్కన పెడితే ఈ సినిమా ప్రధాన తారాగణం అని చెప్పాలి.

విలక్షణ నటుడు కమల్ హాసన్ తో పాటుగా తమ నటనతో ఇండియన్ సినిమా దగ్గర గుర్తింపు తెచ్చుకున్న మరో స్టార్ నటులు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అలాగే ఫహద్ ఫాజిల్ లు కూడా నటించడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి మూవీ లవర్స్ లో నెలకొంది. అయితే ఇదిలా ఉండగా ఇప్పుడు ఇంకో ఆసక్తికర సమాచారం కన్ఫర్మ్ అయ్యింది.

ఈ సినిమాలో ఈ ముగ్గురుతో పాటు మరో అద్భుత నటుడు సూర్య కూడా ఈ సినిమాలో చిన్న కీలక పాత్ర చేసినట్టుగా తమిళ సినీ వర్గాలు కన్ఫర్మ్ చేసాయి. దీనితో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు లోకేష్ ఈ సినిమాలో సూర్య కోసం కీలక పాత్ర రాసాడని దాన్ని సూర్య చేసినట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. ఇక ఈ సెన్సేషనల్ కాంబోలో సినిమా ఎలా ఉంటుందో చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :