పవన్ సినిమా కోసం మరొక స్టంట్ మాస్టర్ !
Published on Apr 16, 2017 7:55 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ ల కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెసిందే. వీరిద్దరి కలయికలో గతంలో వచ్చిన ‘జల్సా, అత్తారింటికి దారేది’ వంటి సినిమాలు భారీ విజయాల్ని సాధించడంతో ఈ ప్రాజెక్ట్ పై కూడా అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇకపోతే ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం కోసం సుమారు ముగ్గురు పాపులర్ స్టంట్ మాస్టర్స్ పనిచేయనున్నారు.

సినిమా రెగ్యులర్ షూట్ ఆరంభంలో కొరియోగ్రాఫర్ విజయన్ కొన్ని పోరాట సన్నివేశాలని కంపోజ్ చేయగా, రెండు రోజుల క్రితం నేషనల్ అవార్డు విన్నర్ పీటర్ హెయిన్స్ సైతం ఈ సినిమా కోసం వర్క్ చేయనున్నారని వార్త బయటికొచ్చింది. ఇకపోతే తాజాగా మరొక స్టంట్ కొరియోగ్రాఫర్ రవి వర్మ కూడా ఈచిత్రానికి పనిచేస్తున్నారని తేలింది. ఈ విషయాన్ని రవి వర్మ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ సినిమాకు మొత్తం ముగ్గురు ఫైట్ మాస్టర్లు పనిచేయనున్నారు. దీన్నిబట్టి ఇందులో యాక్షన్ సీన్స్ కొత్తగా ఉంటాయని ఇట్టే అర్థమవుతోంది.

 
Like us on Facebook