రజనీ ‘కాల’ సినిమాలో మరో సూపర్ స్టార్ ?


సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘కాల’. పా.రంజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటోంది. ‘కబాలి’ తర్వాత రజనీ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ మీద అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ స్థాయి అంచనాలున్నాయి. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కూడా నటిస్తున్నారని తమిళ సినీ వర్గాల్లో గుస గుణాలు వినిపిస్తున్నాయి. దీంతో ఆ అంచనాలు ఇంకాస్త పెరిగిపోయాయి.

అయితే విషయమై చిత్ర టీమ్ నుండి ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కనుక ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే ఇంకొంత సమయం వేచి ఉండాల్సిందే. గతంలో మమ్ముటి, రజనీ ఇద్దరూ కలిసి మణిరత్నం డైరెక్ట్ చేసిన ‘దళపతి’ అనే సూపర్ హిట్ చిత్రంలో నటించిన సంగతి తెల్సిందే. ఇకపోతే వండర్ బార్ ఫిలిమ్స్ పతాకంపై ధనుష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటుడు నానా పటేకర్ ఒక కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం.