రాజకీయాల్లోకి రానున్న మరొక తమిళ హీరో !

డిసెంబర్ 31న సూపర్ స్టార్ రాజనీకాంత్ తన రాజకీయ రంగప్రవేశంపై అధికారిక ప్రకటన చేసి, కొత్త పార్టీని పెడతానని ప్రకటించి దేశవ్యాప్తంగా సంచలనం రేపోయిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుత తమిళ రాజకీయాల్లో ఒక రకమైన హడావుడి మొదలైంది. ఇంతలోపే మరొక హీరో రాఘవ లారెన్స్ కూడా రాజకీయాల్లోకి రాబోతున్నారని సమాచారం.

మొదట గ్రూప్ డ్యాన్సర్ గా ప్రస్థానం ప్రారంభించి కొరియోగ్రఫర్ గా ఆతరవాత హీరో, ఆ తరవాత దర్శకుడిగా ఎదిగి, ఎన్ని సేవా కార్యక్రమాల్ని చేస్తున్న లారెన్స్ కు రజనీకాంత్ అంటే ఎనలేని అభిమానం. అందుకే అయనకు సపోర్ట్ చేసేందుకే లారెన్స్ రాజకీయాల్లోకి వస్తున్నారట. దీనిపై జనవరి 4న ప్రెస్ మీట్ పెట్టి అధికారిక ప్రకటన చేస్తారట లారెన్స్. మరి దీనిపై సూపర్ స్టార్ ఎలా స్పందిస్తారో చూడాలి.