ఏపీలో నష్టాలు భరించలేక మరో థియేటర్ ధ్వంసం..!

Published on Nov 25, 2021 1:00 pm IST

ఇప్పుడు ఏపీలో మారుతున్నటువంటి పరిస్థితులు థియేట్రికల్ సంస్థల వారికి మరింత భారంగా మారుతూ వస్తున్న సంగతి తెలిసిందే. గత కరోనా సమయంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నడూ లేని నష్టాలను ఎంతో కాలం చరిత్ర ఉన్న థియేటర్స్ శాశ్వతంగా మూతపడిపోవడం సినీ ప్రేమికుల హృదయాలను ముక్కలు చేసాయి. అయితే ఇప్పుడు అలాగే ఏపీలో మరో థియేటర్ నష్టాలను తాళలేక శాశ్వతంగా మూతపడి ధ్వంసం చేయడం జరిగింది.

గుంటూరు జిల్లా, తెనాలిలో స్వరాజ్ అనే థియేటర్ కి ఏళ్ల తరబడిన చరిత్ర ఉంది. తెలుగు సినిమా నాట మధుర చిత్రాలు గుండమ్మ కథ, సువర్ణ సుందరి లాంటి సినిమాలు ప్రదర్శితం గావించబడిన ఈ థియేటర్ ని నిన్న అధికారికంగా పడగొట్టారు. నష్టాలు భరించలేకే ఈ నిర్ణయం తీసుకున్నామని యాజమాన్యం తెలిపి దాని స్థానంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని యాజమాన్యం నిర్ణయించుకున్నారట.

సంబంధిత సమాచారం :