రొమాంటిక్ మరో ట్రైలర్ లో మాస్ యాంగిల్ చూపించిన ఆకాష్!

Published on Oct 25, 2021 7:15 pm IST


ఆకాష్ పూరి హీరోగా, కేతిక శర్మ హీరోయిన్ గా అనిల్ పాడురీ దర్శకత్వం లో తెరకెక్కిన తాజా చిత్రం రొమాంటిక్. ఈ చిత్రం ట్రైలర్ విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ చిత్రం నుండి మరొక ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. రొమాంటిక్ బ్యాడ్ యాస్ ట్రైలర్ అంటూ విడుదల అయిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆకాష్ పూరి మాస్ యాంగిల్ పెర్ఫెక్ట్ గా మ్యాచ్ అయినట్లు ట్రైలర్ ను చూస్తే తెలుస్తుంది.

ఈ ట్రైలర్ లో హీరో హీరోయిన్ ల మధ్యన ఉండే రొమాంటిక్ సన్నివేశాలను సైతం చూపించడం జరిగింది. ఈ చిత్రం లో రమ్య కృష్ణ పవర్ ఫుల్ పోలీస్ పాత్ర లో నటిస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ మరియు పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ పతాకంపై ఛార్మి మరియు పూరి జగన్నాథ్ లు నిర్మిస్తున్నారు. అక్టోబర్ 29 వ తేదీన ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

More