“రాధే శ్యామ్” నుంచి మరో ట్రీట్ రెడీ అవుతోందా.?

Published on Oct 26, 2021 7:02 am IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కించిన బిగ్గెస్ట్ పీరియాడిక్ లవ్ స్టోరీ “రాధే శ్యామ్”. ఎనలేని అంచనాలు ఉన్న ఈ చిత్రం నుంచి మేకర్స్ ఇటీవలే ఓ గ్రాండ్ టీజర్ కట్ ని కూడా రిలీజ్ చెయ్యగా దానికి భారీ స్థాయి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక ఇదిలా ఉండగా ఇంకో ఇంట్రెస్టింగ్ బజ్ ఈ సినిమా పై వినిపిస్తోంది.

దాని ప్రకారం రానున్న ఇంకొన్ని రోజుల్లోనే ఈ చిత్రం నుంచి ఇంకో టీజర్ కూడా రాబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇది దేనిపై ఉంటుందో కానీ సెకండ్ టీజర్ అయితే కన్ఫర్మ్ అట. దీనితో మరో ట్రీట్ రాధే శ్యామ్ నుంచి సిద్ధం అవుతుంది అని చెప్పాలి. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. ఇక ఈ భారీ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :

More