టాక్..”రాధే శ్యామ్” సెకండ్ ట్రీట్ కూడా ఆల్ మోస్ట్ ఫిక్స్.!

Published on Oct 28, 2021 9:00 am IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించిన అద్భుతమైన ప్రేమ్ కావ్యం “రాధే శ్యామ్”. మరి ఈ చిత్రం నుంచి రీసెంట్ గానే ప్రభాస్ బర్త్ డే కానుకగా ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ టీజర్ రిలీజ్ అయ్యి భారీ రెస్పాన్స్ ని కొల్లగొట్టింది.

అయితే ఇక దీని తర్వాత మళ్ళీ ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ టీజర్ ని చిత్ర యూనిట్ సిద్ధం చేస్తున్నారని టాక్ రాగా ఇది కూడా ఆల్ మోస్ట్ ఫిక్స్ అని తెలుస్తుంది. వచ్చే దీపావళి కానుకగా అది ఆ తర్వాత మళ్ళీ అదే నెలలో ఇంకో అదిరే అప్డేట్ ని చిత్ర యూనిట్ రివీల్ చేయనున్నట్టుగా బజ్ వినిపిస్తుంది.

ఎలాగో టైం దగ్గర పడుతుంది కాబట్టి ఇక రాధే శ్యామ్ నుంచి వరుస అప్డేట్స్ మున్ముందు మనం ఆశించవచ్చు. ఇక ఈ భారీ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :

More