శరవేగంగా “రామారావు ఆన్ డ్యూటీ” షూటింగ్… సీసా సాంగ్ చిత్రీకరణ!

శరవేగంగా “రామారావు ఆన్ డ్యూటీ” షూటింగ్… సీసా సాంగ్ చిత్రీకరణ!

Published on Jan 12, 2022 1:30 PM IST

రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. ఈ చిత్రం లో రవితేజ సరసన హీరోయిన్ గా దివ్యాంశా కౌశిక్ హీరోయిన్ గా నటిస్తుంది. రజిష విజయన్, నాజర్, పార్వతీ లోకేష్, నరేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ను శ్రీ లక్ష్మి వేంకటేశ్వర సినిమాస్ మరియు ఆర్టీ టీమ్ వర్క్స్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియో లు విడుదల అయి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన మరొక అప్డేట్ ను చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించడం జరిగింది. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది అని, ప్రస్తుతం సీసా సాంగ్ చిత్రీకరణ లో చిత్ర యూనిట్ బిజిగా ఉన్నట్లు తెలుస్తోంది. శేఖర్ మాస్టర్ ఈ సీసా పాట కి కొరియోగ్రఫీ అందిస్తున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఈ చిత్రాన్ని మార్చి 25 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

https://twitter.com/directorsarat/status/1481143648377274371?s=20

సంబంధిత సమాచారం

తాజా వార్తలు