అమీర్ “లాల్ సింగ్ చడ్డా” స్ట్రీమింగ్ పై మరో అప్డేట్..!

అమీర్ “లాల్ సింగ్ చడ్డా” స్ట్రీమింగ్ పై మరో అప్డేట్..!

Published on Aug 10, 2022 5:44 PM IST

బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి మోస్ట్ అవైటెడ్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది అక్కడి మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం “లాల్ సింగ్ చడ్డా” సినిమా అనే చెప్పాలి. ఎన్నో ఏళ్ల నుంచి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు రేపు రిలీజ్ అవుతుండగా బాలీవుడ్ లో ఏ సినిమాకి కూడా రానటువంటి ఎక్కువ స్థాయి నెగిటివిటి కూడా ఈ చిత్రానికే వచ్చింది.

మరి వీటిని దాటి అయితే ఆమీర్ తన సినిమా కంటెంట్ పైనే నమ్మకం పెట్టుకొని ఎప్పుడు లేని విధంగా భారీ ప్రమోషన్స్ ని కూడా తాను చేస్తున్నాడు. మరి తెలుగులో కూడా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఓటిటి రిలీజ్ కి సంబంధించి లేటెస్ట్ గా మరో అప్డేట్ తెలుస్తుంది. ఇది వరకే ఈ చిత్రం రిలీజ్ అయ్యిన 6 నెలల వరకు ఓటిటిలో రాదని కన్ఫర్మ్ అయ్యింది. మరి ఇప్పుడు అయితే ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటిటి సంస్థ “వూట్” కూడా సొంతం చేసుకుంది అని దీనిలో కూడా ఆరు నెలల తర్వాతే స్ట్రీమింగ్ కి వస్తుందని తెలుస్తుంది. మరి ఈ సినిమా ఫలితం అయితే ఎలా ఉంటుందో చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు