చూపే బంగారమాయేనే శ్రీ వల్లీ…అక్టోబర్ 13 కి సిద్దం చేస్తున్న డిఎస్పీ, సిద్ శ్రీరామ్!

Published on Oct 10, 2021 7:30 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి భాగం పుష్ప ది రైస్ పేరిట డిసెంబర్ నెల 17 వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, విడియోలు, ఫస్ట్ సింగిల్ సినిమా పై భారీ అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ చిత్రం నుండి రెండవ సింగిల్ ను విడుదల చేయడానికి సిద్దంగా ఉన్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది.

చూపే బంగారమాయేనే శ్రీవల్లి అంటూ సిద్ శ్రీరామ్ పాడుతున్న వీడియో ను పుష్ప టీమ్ సోషల్ మీడియా లో షేర్ చేయడం జరిగింది. పుష్ప చిత్రానికి సంగీతం అందిస్తున్న దేవీ శ్రీ ప్రసాద్ పాటను కంపోజ్ చేస్తుండగా, సిద్ శ్రీరామ్ పాడారు. ఈ పాట నాలుగు బాషల్లో అక్టోబర్ 13 వ తేదీన ఉదయం 11:07 గంటలకి విడుదల కానుంది. ఈ చిత్రం లో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా రష్మీక మండన్న నటిస్తుంది. పుష్పరాజ్ పాత్ర లో అల్లు అర్జున్ నటిస్తుండగా, శ్రీవల్లి పాత్రలో రష్మిక నటిస్తుంది. ఈ చిత్రం లో మలయాళ నటుడు ఫాహద్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలో ఒక్కొక్కటి గా విడుదల కానున్నాయి.

సంబంధిత సమాచారం :