థాంక్యూ చిత్రం నుండి మరొక వర్కింగ్ స్టిల్ విడుదల!

Published on Oct 11, 2021 7:40 pm IST

అక్కినేని నాగ చైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం థాంక్యూ. ఈ చిత్రం కి సినిమాటోగ్రాఫర్ గా పీసీ శ్రీరామ్ పని చేస్తున్నారు. పీసి శ్రీరామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఫ్రేం లో కూడా తన టాలెంట్ ను కనబరుస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి ఒక వర్కింగ్ స్టిల్ ను విడుదల చేయడం జరిగింది. ఇందులో నాగ చైతన్య మేకొవర్ చాలా డిఫెరెంట్ గా మరియు న్యాచురల్ గా ఉంది. ఈ ఫోటో ను షేర్ చేసిన అనంతరం నుండి సోషల్ మీడియా లో వైరల్ గా మారుతోంది.

థాంక్యూ చిత్రానికి బీవీఎస్ రవి కథ అందిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. నాగ చైతన్య సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుండగా, అవికా గోర్ మరొక లేడీ లీడ్ రోల్ లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :